కాంగ్రెస్‌కు దూరం.. బిజెపికి దగ్గర: జగన్ వ్యూహమా?

హైదరాబాద్: విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన తన ఆమరణ దీక్ష ప్రారంభించే సమయంలో ధ్వజమెత్తారు. సోనియాను జగన్ చాలాకాలం తర్వాత విమర్శించడంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ నేతలు కూడా అధిష్టానానికి, జగన్ పార్టీకి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విభజన విషయంలో జగన్ ఇన్నాళ్లు కాంగ్రెసును, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ వచ్చారు. గతంలో తనపై కుట్ర చేశారని నేరుగా సోనియా పైన విరుచుకుపడ్డ జగన్.. విభజన విషయంలో మాత్రం కాంగ్రెస్ అధినేత్రిని తప్పుపట్టక పోవడాన్ని టిడిపి మొదటి నుండి ప్రశ్నిస్తోంది. ఇదే అదునుగా సోనియాను విమర్శించక పోవడమే కాంగ్రెసు, జగన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనమని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

Attack Sonia, praising Modi: Is Jagan's strategy?

జగన్‌కు బెయిల్ రావడం, విభజన విషయంలో సోనియాపై జగన్ విమర్సలు గుప్పించక పోవడంతో ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లుగా ప్రజలు అనుమానిస్తున్నారని కొందరు కాంగ్రెసు పార్టీ నేతలు కూడా పలుమార్లు ఆరోపించారు. టిడిపి దీనిని విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో జగన్ వెనక్కి తగ్గి, మ్యాచ్ ఫిక్సింగ్ ప్రజల్లోకి మరింత వెళ్తే నష్టమనే భావనతోనే ఆయన తాజాగా సోనియా పైన విమర్సలు గుప్పించారని విమర్శిస్తున్నారు.

జగన్ వ్యూహాత్మకంగానే సోనియా పైన విమర్శలు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పైన ప్రశంసలు గుప్పించారని అంటున్నారు. ఇప్పటికే సీమాంధ్రలో జగన్-కాంగ్రెసు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరిందనే అనుమానం ప్రజల్లోకి బలంగా వెళ్లిందంటున్నారు. కాంగ్రెసు నేతలు, టిడిపి విమర్శలే కాకుండా ప్రజల్లోకి బలంగా వెళ్లిందని గుర్తించినందువల్లే జగన్ కాంగ్రెసుకు దూరంగా జరిగినట్లు కనిపించడానికి అలా స్పందించి ఉంటారని అంటున్నారు.

మోడికి కితాబిచ్చిన జగన్ బిజెపిని లౌకికవాద పార్టీకి మార్చాలని కోరారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను బిజెపికి మద్దతివ్వనని చెప్పిన జగన్ పరోక్షంగా మరోసారి మోడీ పాలనకు కితాబివ్వడమే కాకుండా లౌకికవాద పార్టీగా మార్చాలని కోరడం ద్వారా దానికి ఎప్పటికీ దూరంగానే ఉంటానని చెప్పారంటున్నారు. కాంగ్రెసుకు దగ్గరయ్యారనే ప్రచారాన్ని దూరం చేసేందుకే ఆయన మోడీని వ్యక్తిగతంగా పొగిడి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+