శ్రీవారి భక్తులకు గమనిక.. వీకెండ్‌లో స్పెషల్ ట్రైన్స్..
కళియుగ వైకుంఠ దైవమైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఇక, శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. వీకెండ్‌లో స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. తిరుపతికి వెళ్లేందుకు ప్రయాణికుల రద్దీ పెరగడంతో పలు స్పెషల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకరానున్నారు. ఈ నేపథ్యంలో హిసార్ నుంచి తిరుపతికి రెండు వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ను తీసుకొచ్చారు. ఆ ట్రైన్స్ వివరాలేంటో చూసేద్దాం..
04717 అనే నెంబర్‌గల హిసార్ టు తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 7వ తేది నుంచి డిసెంబర్ 14వ తేది వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి శనివారం హిసార్‌లో బయలుదేరి ఆదివారం తిరుపతి స్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆగుతుంది.

అలాగే, 04718 అనే నెంబర్‌గల తిరుపతి టు హిసార్ వీక్లీ స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 9వ తేది నుంచి 16వ తేదీ వరకూ ప్రయాణిస్తోంది. ఈ ట్రైన్ ప్రతి రోజు సోమవారం తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు హిసార్ స్టేషన్ చేరుకుంటుంది. ఇక, ఈ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల కోసం ఆగుతుంది. ప్రయాణికులు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరికొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లు..
ఇదిలా ఉండగా, ప్రయాణీకుల రద్దీని నివారించేందుకు మరికొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో వాల్తేర్ డివిజన్‌లోని విశాఖపట్నం టు కిరండూల్ రైళ్లకు స్లీపర్, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ను పెంచారు. 08551 అనే నెంబర్‌గల విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ ట్రైన్ రేపటి (డిసెంబర్ 1) నుంచి డిసెంబర్ 31 వరకు నడిచే ఈ ట్రైన్‌కు ఒక స్లీపర్ క్లాస్ పెంచనున్నారు. ఇక, డిసెంబర్ 6వ తేది నుంచి రోజు మార్చి రోజు జనవరి 1 వరకు ఒక థర్ట్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జత చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే డిసెంబర్ 2వ తేది నుంచి జనవరి ఒకటి వరకు కిరండూల్- విశాఖపట్నం ప్యాసింజర్ ( 08552) ట్రైన్‌కు ఒక స్లీపర్ క్లాస్ పెంచనున్నారు. డిసెంబర్ 7వ తేది నుంచి రోజు మార్చి రోజూ జనవరి 2 వరకు ఒక థర్ట్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జత చేయనున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని రైల్వేశాఖ అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications