చంద్రబాబుకు అడ్డంగా చిక్కిపోయారు, జగన్ అండతో మింగేశారు, ఆడిటింగ్ లో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో రోజుకు ఒక స్కామ్ బయటకు వస్తోంది. చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే మొదట కుప్పంలోని జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టారు. తరువాత చిత్తూరు జడ్పీలో జరిగి స్కామ్ బయటకు వచ్చింది. ఇప్పుడు అదే చిత్తూరు నగరపాలక సంస్థలో జరిగిన భారీ గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది.
చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ లో కోట్లాది రూపాయల నిధులు గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిత్తూరు కార్పొరేషన్ లో ఆడిటింగ్ చేశారు. ఈ సందర్బంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆడిటింగ్ క్లియర్ చేయాల్సి ఉన్నా అలా జరగలేదని, ఇష్టానుసారంగా నీళ్లు ఖర్చు చసినట్లు కార్పొరేషన్ నిధులు ఖర్చు చేశారని వెలుగు చూసింది.

చిత్తూరు నగరపాలక సంస్థలో సుమారు రూ. 28 కోట్లకు పైగా గోల్ మాల్ జరిగిందని వెలుగు చూడటం కలకలం రేపుతోంది. 2023 డిసెంబర్ 11వ తేదీన చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా డాక్టర్ జే. అరుణ బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పటి వైసీపీ మంత్రి అండదండలతో అరుణకు చిత్తూరు మునిసిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.
చిత్తూరు నగరపాలక సంస్థలో నగదు చెల్లింపులు, రాబడులు, జమకు సంబంధించి క్యాష్ బుక్ నిర్వహణ గురించి అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని, అన్ని లెక్కలు గాలికి వదిలేసి వచ్చిన నిదులు వచ్చినట్లు ఖర్చు చేశారని, కోట్లాదిరూపాయల నిధులు దారిమళ్లించారని ఆడిటింగ్ లో వెలుగు చూసిందని ఆడిట్ శాఖ ఆర్ డీడీ గోవిందప్ప తెలిపారు. చిత్తూరు నగరపాలిక సంస్థలో జరిగిన గోల్ మాల్ వ్యవహారంలో సక్రమంగా లెక్కలు చూపించకుంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని గోవిందప్ప అంటున్నారు.
చిత్తూరు నగరపాలిక సంస్థతో లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేసినా వాటికి స్టాక్ రిజిస్టర్, లెక్కలు లేవని వెలుగు చూసింది. డీఅండో వో ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించి సుమారు రెండు కోట్ల రూపాయల పత్లాలేదని వెలుగు చూసింది..కాంట్రాక్టర్లకు ఎంత నగదు ఇచ్చారు, ఎంత బిల్లులు చెల్లించారు అని సక్రమంగా రికార్డులు కూడా లేవని వెలుగు చూసింది. అకౌంట్స్ విభాగంలో ఈఎండీ, ఎస్ ఎఫ్ డీ సక్రమంగా లేదని వెలుగు చూసింది. ఈ వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి కూటమి ప్రభుత్వం సిద్దం అవుతోందని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications