షాక్: అమ్మాయిపై గ్యాంగ్ రేప్‌కు ఆంటీ సాయం

వివరాలు ఇలా ఉన్నాయి - హైదరాబాదులోని ఫూల్‌బాగ్‌కు చెందిన 14 బాధితురాలు ఏప్రిల్ 4వ తేదీన ఇంటి నుంచి వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు దినసరి వేతన కూలీలు. తాను ఆంటీ వద్దకు వెళ్తున్నానని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పి వెళ్లింది.
అబ్దుల్ షకీల్ అనే యువకుడు ఆమెను బాబానగర్‌లోని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అతనితో అమ్మాయికి ఇదివరకే పరిచయం ఉంది. షకీల్ ఇంటికి అతని మిత్రులు ఐదుగురు వచ్చారు. మహబూబ్ అలీ, బషీర్ ఖాన్, ఇక్బాల్ ఖాన్, హమీద్, అజర్‌లుగా వారిని గుర్తించారు. వారి వయస్సు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుంది. అమ్మాయిపై ఆరు రోజుల పాటు పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఆ తర్వాత అమ్మాయిని ఆంటీ గుహర్ అపా ఇంటికి తీసుకుని వెళ్లారు. అక్కడ అజర్, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిపై లైంగిక దాడి జరిపారు. చివరికి గుహర్, తన సోదరి షాపింగ్ చేస్తూ బాధితురాలి సోదరుడికి కనిపించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications