ఆటో డ్రైవర్ హత్య: పదో తరగతి విద్యార్థుల ఆత్మహత్య

ఇదిలా వుంటే, హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో రాజ్‌కుమార్ అనే వ్యక్తిని మంగళవారం ఉదయం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో మెమొరీ కార్డులు, విదేశీ సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌కుమార్ బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం దుర్గాపురం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ - ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని లంకెలపాలెం వద్ద రైల్వేట్రాక్‌పై ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను అనకాపల్లి జేఎంజే స్కూల్ విద్యార్థులు జోగి, స్వరూప్‌లుగా గుర్తించారు. మృతుల జేబులో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications