పవన్ కు మంత్రి అవంతి సవాల్ - సినిమాల్లో అపజయాలే ఎక్కువ : నాకు నేనే హీరోని..!!

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేసారు. కొందరు మంత్రులను టార్గెట్ చేసారు. వెల్లంపల్లి... అవంతి వంటి వారు మంత్రులవ్వటం పైనా సీరియస్ వ్యాఖ్యలు చేసారు. దీంతో..ఇప్పుడు వరుసగా మంత్రులు పవన్ వ్యాఖ్యల పైన గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ సభ పూర్తి కాగానే.. మంత్రి పేర్ని నాని జనసేనాని వ్యాఖ్యల పైన స్పందించారు. ప్రతీ విమర్శకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసారు. చంద్రబాబు ను సీఎం చేయటం కోసమే పవన్ ప్రయత్నాలంటూ విమర్శించారు.

పవన్ పై మంత్రుల ఫైర్

పవన్ పై మంత్రుల ఫైర్

ఇక, తన పేరు ప్రస్తావించి..వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై మరో మంత్రి అవంతి శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే హీరో అని..తాను పొలిటికల్ హీరోనంటూ పేర్నొన్నారు. పవన్‌కు అహంభావం ఎక్కువ అని ఆరోపించారు. ఆయన సినిమాల్లో విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేసారు.

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప పవన్ వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నం చేయరా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఎక్కడైనా గూండాగిరి చేశానని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. నిరూపించకపోతే పవన్ రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ అవంతి సవాల్ చేసారు.

టీడీపీతో ఎందుకు వీడారు.. మళ్లీ ఎందుకు

టీడీపీతో ఎందుకు వీడారు.. మళ్లీ ఎందుకు

పవన్‌ టీడీపీతో పొత్తు నుంచి ఎందుకు బయటకు వచ్చారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు కలుస్తానంటున్నారని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రానికి ఏం సాధించగలిగారో ప్రజలకు పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చే పవన్‌కు అభివృద్ధి గురించి ఏం తెలుసుని ధ్వజమెత్తారు.

బీజేపీతో పొత్తు ఏపీలోనా.. తెలంగాణలో సైం ఉంటుందా అని ప్రశ్నించారు. పవన్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువని అవంతి వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏమైనా సాధించారా అంటూ అవంతి నిలదీసారు.

Recommended Video

    Elections 2024: Pawan Kalyan మైండ్ గేమ్ 2019 లో AP CM Jagan ముందుగానే Manifesto | Oneindia Telugu
    ఎవరిని సీఎంగా చేస్తారు

    ఎవరిని సీఎంగా చేస్తారు

    చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని మంత్రి అవంతి ఆరోపించారు. అవకాశం వస్తే చంద్రబాబు పవన్‌ను సీఎం చేస్తారా లేక లోకేష్‌ను చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. తమపై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకోమన్నారు. తానను దేవుడిని నమ్మే వ్యక్తినని చెప్పారు. కాకినాడ ఎమ్మెల్యే ను పవన్ హెచ్చరించటం పైన అవంతి స్పందించారు. తన సినిమాకు తానే హీరోనని చెప్పుకొచ్చారు. ఎవరి మీద ఆధారపడటం లేదన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+