పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడమీ: మంత్రి
విజయవాడ: శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్దాయి సమావేశంలో పాల్గోన్న సందర్బంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడమీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపరచనున్నామని మంత్రి చెప్పారు. విశాఖ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడెమీ ఏర్పాటు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోందన్నారు.

చిన్న విమానాశ్రయాల వల్ల రవాణా రంగంతో పాటు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications