గంటా టిడిపిలోకి రీఎంట్రీ: అయ్యన్నపాత్రుడు అలక

శనివారంనాడు తెలుగుదేశం విశాఖనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అయ్యన్న పాత్రుడు, పప్పుల చలపతి రావు డుమ్మా కొట్టారు. అయితే, ప్రస్తుతం పార్టీలో ఏర్పడిన వర్గపోరు త్వరలో సమసిపోతుందని గంటా శ్రీనివాస రావు అంటున్నారు. రాష్ట్ర విభజన కారణంగానే తాను కాంగ్రెసు నుంచి బయటకు వచ్చినట్లు ఆయన చెప్పారు.
ఈ నెల 12వ తేదీన గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీలో చేరుతారని భావిస్తున్నారు. ఆయనతో పాటు నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఈ స్థితిలో గంటా శ్రీనివాస రావును చంద్రబాబు కాదనలేకపోతున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారంనాడు గంటా శ్రీనివాస రావు పాల్గొన్న కీలక సమావేశాన్ని కూడా అయ్యన్నపాత్రుడు వర్గం బహిష్కరించింది. గంటాతో పాటు పార్టీలోకి వస్తున్న శాసనసభ్యులు కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి, పంచకర్ల, తదితరులను తెలుగుదేశం పార్టీ నేతలకు పరిచయం చేయడానికి ఆ సమావేశం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications