పిస్టల్‌తో కాల్చుకుని బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రవీందర్ సింగ్ యాదవ్ హకీంపేటలోని సిఆర్‌పిఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ క్వార్టర్‌లోనే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆయన కుమారుడు రిషి సింగ్ యాదవ్ (20) కొంపల్లిలోని మల్లారెడ్డి కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
కొంత కాలం రిషి సింగ్ అనారోగ్యంతో బాధపడ్డాడు. దాంతో చదువులో వెనకబడి పోయాడు. గురువారంనాడు కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఇయర్ ఫోన్ ద్వారా పాటలు వింటూ తండ్రి పిస్తోల్‌తో తలకు కాల్చుకున్నాడు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
మృతికి సంబంధించిన కారణాలేమిటనేది కచ్చితంగా తెలియడం లేదు. చదువులో వెనకబడిపోవడం, మానసిక ఒత్తిడి, కుటుంబ సభ్యులు దూషణలతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications