మహిళకు టోకరా: భర్త తిరిగొస్తాడని మంట పెట్టాడు (పిక్చర్స్)

హైదరాబాద్: ప్రజలను నమ్మించి బురిడీ కొట్టిస్తున్న దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేస్తున్న ఓ దొంగబాబా, అతని సహాయకుడిని హైదరాబాదులోనినారాయణగూడ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.

ఇన్‌స్పెక్టర్‌ భీమ్‌రెడ్డి కథనం ప్రకారం - బోయినపల్లికి చెందిన జ్యోతి (40), ఆమె భర్త వెంకటనారాయణ మధ్య మనస్పర్థలొచ్చి వేరుగా ఉంటున్నారు. తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న జ్యోతి ఓ రోజు ‘కుటుంబ సమస్యలా.. భర్త మాట వినడం లేదా.. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందా.. రండి మీ అన్ని సమస్యలకు సమాధానం మా దగ్గరుంది'.. అనే బాబా రజాఖాన్‌ ప్రకటన బుల్లితెరపై చూసింది.

అది చూసి ఆ బాబాను జ్యోతి సంప్రదించింది. హిమాయత్‌నగర్‌లో ఆశ్రమం ఉందని, తనను వచ్చి కలిస్తే.. పరిష్కారం చూపుతానని రజాఖాన్‌ తెలిపాడు. దీంతో జ్యోతి హిమాయత్‌నగర్‌లోని బాబా రజాఖాన్‌ను కలిసింది. రూ.200 ఫీజు కట్టింది.

దర్శనమిచ్చి ఇలా...

దర్శనమిచ్చి ఇలా...

మహిళకు దర్శనమిచ్చిన బాబా ఆ గృహణి నుంచి ఆమె భర్త ఫొటో, కొన్ని కాగితాలను తీసుకొని మంటల్లో వేశాడు.

చూశావా ఇదే...

చూశావా ఇదే...

మంట ఎగిసిపడటంతో చూశావా.. మంట ఎంత ఎత్తుకు లేచిందో.. ఇంకా ఆలస్యం చేస్తే నీ బిడ్డ, కొడుకు కూడా చనిపోయేవారంటూ ఆమె భయపెట్టాడు.

రూ. 30 వేలు ఇస్తే...

రూ. 30 వేలు ఇస్తే...

‘రూ.30 వేలు ఇస్తే.. నీకు పట్టిన దరిద్రాన్ని పోగొట్టి, నీ భర్తను ఇంటికి వచ్చేలా చేస్తానని' నమ్మించాడు.

ఒంటిపై నగలు అమ్మి..

ఒంటిపై నగలు అమ్మి..

బాబాపై నమ్మకంతో ఆమె తన ఒంటిపై ఉన్న నగలు అమ్మి మరీ బాబా అడిగిన మొత్తాన్ని చెల్లించింది. ఆ తర్వాత పని కాకపోగా.. బాబాను కలవడానికి వస్తే.. కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

పోలీసులను ఆశ్రయించిన మహిళ...

పోలీసులను ఆశ్రయించిన మహిళ...

దాంతో జ్యోతి నారాయణగూడ పోలీసులను ఆశ్రయించింది. మీడియాను వెంటబెట్టుకుని రంగంలో దిగిన ఇన్‌స్పెక్టర్‌ భీమ్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి బాబా స్థావరంపై దాడి చేశారు.

మీడియా సాయంతో...

మీడియా సాయంతో...

బాబా రజాఖాన్‌ను, అతని సహాయకుడు ఆసీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ బాబాను ప్రశ్నించి అతను మోసం చేసే తీరును అతని ద్వారానే మీడియా ముందు చెప్పించారు.

బుల్లితెరపై ప్రకటనలు ఇచ్చి..

బుల్లితెరపై ప్రకటనలు ఇచ్చి..

బుల్లితెరపై ప్రకటనలు ఇచ్చి అమాయకులను బురిడి కొట్టిస్తున్న నకిలీ బాబా ఆటను పోలీసులు పకడ్బందీ కట్టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+