చంద్రబాబు చక్రం తిప్పి ఉంటారా!: అందుకే బిగ్ బజార్ తెరపైకి వచ్చిందా?
ఫ్యూచర్ గ్రూప్ తో కుదిరిన ఒప్పందంతో.. ఆ సంస్థకు మేలు చేకూరేలా కేంద్రం వద్ద బిగ్ బజార్ పేరును చంద్రబాబు సిఫారసు చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ : బిగ్ బజార్ మాల్స్‌లో క్యాష్ విత్ డ్రా అవకాశం కల్పించడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పి ఉంటారా! అన్నది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న. మొన్నీమధ్యే తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్ కు విక్రయించడం.. బిగ్ బజార్ మాల్స్ సైతం ఫ్యూచర్ గ్రూప్ ఆధ్వర్వంలోనే నడుస్తుండడం.. ఈ ప్రశ్నలకు ఊతమిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఎన్నో రిటైల్ మార్కెట్ సంస్థలు ఉండగా.. బిగ్ బజార్‌కే ఈ అవకాశం దక్కడం వెనుక ఖచ్చితంగా చంద్రబాబు హస్తం ఉండుంటనేది పలువురి వాదన. ఫ్యూచర్ గ్రూప్ తో కుదిరిన ఒప్పందంతో.. ఆ సంస్థకు మేలు చేకూరేలా కేంద్రం వద్ద బిగ్ బజార్ పేరును చంద్రబాబు సిఫారసు చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది.

చంద్రబాబు సిఫారసు సంగతెలా ఉన్నా.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. సామాన్యులకు కాస్త ఊరట లభించనుంది. ఈ నెల 24వ తేదీ నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్‌లో డెబిట్ కార్డు ద్వారా రూ.2000 వరకు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications