'బేబీ' బ్యూటీ కెరీర్.. కేక
బేబీ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో చూస్తూనే ఉన్నాం. ఇందులో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఈ అమ్మడు ఎంతో కష్టపడి, ఇష్టపడి నటించింది. ఈ ఒక్క సినిమా ఈ బ్యూటీ జీవితాన్ని మార్చేసింది.
బేబీ సినిమా విడుదలైన తర్వాత అమ్మడుకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఏ సినిమాలో నటిస్తుందనే విషయం మాత్రం బయటకు రాలేదు. తదుపరి సినిమాను ఇంకా ప్రకటించలేదు.. కెరీర్ ఎలా ఉండబోతోంది? అగమ్యగోచరంగా మారిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ముద్దుగుమ్మ చాలా జాగ్రత్తగా ఆలోచించి బేబీకన్నా ముందుగానే తన కెరీర్ ను జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకుంది.

బేబీ దర్శకుడు సాయి రాజేష్.. తాను తర్వాత తీసే మూడు సినిమాల్లోను కథానాయిక వైష్ణవి అనే ప్రకటించారు. వీటిల్లో కథానాయికగా తీసుకుంటానంటేనే బీబీని అమ్మడు అంగీకరించింది. ఈ సినిమా తర్వాత కూడా వైష్ణవి హీరోయిన్ గానే నటించనుంది. ఒకవేళ స్టార్ హీరోలతో సాయి రాజేష్ సినిమాలు తీస్తే వాటిల్లో హీరోయిన్ వైష్ణవినే అవుతుంది. మున్ముందు ఎలాంటి సినిమాల్లో నటిస్తుందోకానీ బేబీ ఎఫెక్ట్ పడకుండా ఎలాంటి వైవిధ్యమైన పాత్రలను రాబడుతుందో చూడాలి.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో యువ నిర్మాత ఎస్‌కేఎన్ దీన్ని నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.74 కోట్లను వసూలు చేసి ఔరా అనిపించింది. ఇందులో నటించిన నటీనటులందరికీ పరిశ్రమలో, ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది.












Click it and Unblock the Notifications