జోగి రమేష్ కు బెయిల్, అయినా జైలులోనే..!!

మాజీ మంత్రి జోగి రమేష్ కు బెయిల్ లభించింది. అయినా, ఆయన జైలులోనే ఉండాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటుగా ఆయన సోదరుడు పైన ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తనకు సంబంధం లేదంటూ జోగి రమేష్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రమాణం చేసారు. కాగా.. జనార్ధనరావు నుంచి సేకరించిన ఆధారాలతో జోగి బ్రదర్స్ ను అరెస్ట్ చేసారు. ఈ కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో ఇంకా బెయిల్ రాకపోవటంతో జోగి బ్రదర్స్ ఇంకా జైలులోనే ఉండాల్సి ఉంది.

మాజీ మంత్రి జోగి రమేష్ కు బెయిల్ లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఎక్సైజ్ కోర్టులో బెయిల్ మంజూరు అయింది. 79 రోజులుగా ఈ కేసులో వారిద్దరూ జైలులో ఉన్నారు. ఈ రోజు బెయిల్ రావటంతో కొంత మేర ఊరట దక్కింది. కాగా.. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ జోగి రమేష్ నిందితుడుగా ఉండటంతో ఆయనకు ఇబ్రహీం పట్నం కేసులో బెయిల్ లభించినా.. జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు కనిపించటం లేదు.

Bail granted for Jogi brothers in Ibrahimpatnam Liquor case details here

ఈ కేసు కూడా బెయిల్ వస్తేనే జోగి రమేష్ జైలు నుంచి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, జోగి రమేస్ పైన చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల కేసు నుంచి చాలా ఉన్నాయి. వాటిలో ఏమైనా తెరపైకి తీసుకు వస్తారా లేదా అన్నది పోలీసుల ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది.

కాగా, నకిలీ మద్యం వ్యవహారం బయట పడిన సమయంలో అద్దేపల్లి జనార్దన్ రావును సౌతాఫ్రికా నుంచి రప్పించి అరెస్టు చేశారు. అద్దేపల్లి బ్రదర్స్ తో కలిసి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేసినట్లు జనార్దన్ రావు వీడియో విడుదల చేసారు. ఆ వీడియో రాజకీయంగా సంచలనంగా మారింది. ఆ తరువాత విచారణ సమయంలోనూ తనకు జోగి రమేష్ తో ఉన్న వ్యాపార సంబంధాల గురించి జనార్ధన రావు వివరించినట్లు తెలిసింది.

జోగి రమేష్ కు రిమాండ్ విధించిన తరువాత నెల్లూరు జైలుకు తరలించారు. వైసీపీ నేతలు పరామర్శించారు. జోగి రమేష్ అరెస్ట్ పైన మాజీ సీఎం జగన్ సైతం ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. ఇక.. ఇప్పుడు ములకలచెరువు కేసులో బెయిల్ వస్తేనే.. జోగి రమేష్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+