బెయిల్ కండిషన్స్ ఓకే, మరి ఫిక్సింగ్‌వి: జగన్‌పై లోకేష్

జగన్‌కు బెయిల్ కండిషన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయని... మరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కండిషన్స్ ఏమిటో చెప్పాలని నారా లోకేష్ ప్రశ్నించారు. నారా లోకేష్ ట్వీట్స్‌కు పలువురు స్పందించారు.
కాగా, నారా లోకేష్ గత కొంతకాలంగా రాష్ట్రంలోని పలు అంశాల పైన ట్విట్టర్‌లో స్పందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల పైన ఆయన ట్విట్టర్‌లో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తన తండ్రి ట్విట్టర్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఆహ్వానం పలికారు.
మూడు రోజుల క్రితం అధికార కాంగ్రెసు పార్టీ ఫ్యానుకు కరెంట్ ఇస్తూ, కారుకు డీజిల్ పోస్తోందంటూ ట్వీట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు కారు.












Click it and Unblock the Notifications