వర్మ దిష్టి బొమ్మను తన్నిన భజరంగ్‌దళ్ (ఫోటోలు)
హైదరాబాద్: గణేషుడి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన వివిధ పార్టీలు, పలు సంఘాలు, స్వచ్చంధ సంస్థలు మండిపడుతున్నాయి. భజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను అబిడ్స్‌లో సోమవారం తగలబెట్టారు. వర్మ పైన పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
రామ్ గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్మ వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కరుణసాగర్ అనే లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వర్మపై 153ఏ, 505, 298, 504 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
మహారాష్ట్ర నవనిర్మాణసేనకు చెందిన సుమిత్ కంభేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ పానావాలా తదితరులు వేర్వేరుగా కేసులు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ (హైదరాబాద్ నగర ఉత్సవ కమిటీ) నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. హైదరాబాద్, గోవా, విజయవాడ, ఔరంగాబాద్ తదితర పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయి.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ చౌరస్తాలో రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వర్మ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.

అబిడ్స్‌లో రామ్ గోపాల్ వర్మ దిష్టి బొమ్మ దహనం
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపారు. వినాయకుడిపై ట్విట్టర్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. భజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను అబిడ్స్‌లో సోమవారం తగలబెట్టారు.

అబిడ్స్‌లో రామ్ గోపాల్ వర్మ దిష్టి బొమ్మ దహనం
భజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను అబిడ్స్‌లో సోమవారం తగలబెట్టారు. వర్మ దిష్టి బొమ్మను తగలబెట్టి, కాళ్లతో తన్నుతోన్న ఫోటోను ఇక్కడ మీరు చూడొచ్చు.

భజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను అబిడ్స్‌లో సోమవారం తగలబెట్టారు. పూర్తిగా కాలిపోయిన రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మ.

అబిడ్స్‌లో రామ్ గోపాల్ వర్మ దిష్టి బొమ్మ దహనం
భజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను అబిడ్స్‌లో సోమవారం తగలబెట్టారు. పూర్తిగా కాలిపోయిన రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మ.

Click it and Unblock the Notifications