బాలకృష్ణ - నాని కాంబినేషన్ లో మూవీ.. డైరెక్టర్ అతడే

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మల్టీస్టారర్ మూవీ నడుస్తోంది. సీనియర్ హీరోలతో యంగ్ హీరోలు కలిసి నటిస్తున్నారు. దీనివల్ల వారు కూడా బాగా పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించారంటే ఆ సనిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. తాజాగా ఒక అగ్రహీరో, ఒక యంగ్ హీరో కాంబినేషన్ లో సినిమా రాబోతోందన్న వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, నేచురల్ స్టార్ నాని.. ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారట. బాలకృష్ణపై తనకున్న అభిమానాన్ని నాని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. బాలయ్య అభిమానిగా ఓ సినిమాలో కూడా నాని నటించాడు. అన్ స్టాప‌బుల్ వేదిక‌పై బాలకృష్ణను కలిసిన నాని తన అభిమానాన్ని వివరించడంతోపాటు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

balakrishna and nani

బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే బాలకృష్ణ-నాని కాంబినేషన్ లో సినిమా తీయాలనే ఆలోచన అనిల్ కు తట్టింది. బాలకృష్ణను కలిసి అనిల్ స్టోరీ లైన్ చెప్పడం.. వెంటనే బాలయ్య ఓకే అనడం జరిగిపోయాయి.

స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు సినిమా చేయడానికి సిద్ధమని బాలకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది. భగవంత్ కేసరి తర్వాత చిరంజీవితో సినిమా చేయనున్నాడు అనిల్ రావిపూడి. చిరు - అనిల్ రావిపూడి కాంబినేషన్ తరువాత నాని - బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+