బాలకృష్ణ ఆస్తులు రూ.170 కోట్లు, భార్య పేర 100 కోట్లు
హైదరాబాద్: హిందూపురం అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ ఆస్తులు రూ.170 కోట్లు. స్థిర, చరాస్థులు ఉన్నాయి. నామినేషన్ సందర్భంగా బాలకృష్ణ తన ఆస్థుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చారు. తన పేరు మీద, తన భార్య, తన ఇద్దరు కూతూర్ల పేర ఉన్న ఆస్తి మొత్తం నూటా డెబ్బైకోట్ల రూపాయలుగా చూపించారు.
బాలయ్య మొత్తం ఆస్తి రూ.170 కోట్ల 47 లక్షలు. తన భార్య పేరిట రూ.100 కోట్ల 78 లక్షలు ఉన్నట్లు చెప్పారు. తనకు రూ.25 కోట్ల 69 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. భార్య పేరిట అప్పులు రూ.1.29 కోట్లు ఉన్నట్లు చూపించారు. కొడుకు పేరిట రూ.11.50 లక్షల రుణం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి రూ.15.73 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలిపారు.

కాగా, బాలకృష్ణ మధ్యాహ్నం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీది అవినీతివాదమైతే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీది అరాచకవాదమని నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీది మాత్రం అభివృద్ధివాదమని చెప్పారు.












Click it and Unblock the Notifications