నా తండ్రికి వయస్సు పెరుగుతుంటే..: బాలకృష్ణ కూతురు, ఫ్యాన్స్‌కి మంత్రి ప్రశంస

హిందూపురం/హైదరాబాద్: తన తండ్రి, హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వయస్సు పెరిగే కొద్ది ఎనర్జీ ఎక్కువవుతోందని, ఇప్పటికీ మనవడితో చిన్నపిల్లాడిలా ఆడుకుంటుంటాడని నారా బ్రాహ్మణి అన్నారు. ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు.

ఆయన నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్‌ను బ్రాహ్మణి విడుదల చేశారు. ఈ సందర్భంగా బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడారు.

తన తండ్రి 57వ ఏళ్ల వయస్సులోకి అడుగు పెట్టారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని చిన్ననాటి నుంచి తమకు చెబుతుంటేవారన్నారు. అనేక మందికి చికిత్స అందిస్తూ బసవతాకరకం ఆసుపత్రి దేశంలోనే గొప్ప ఆసుపత్రిగా పేరు పొందిందన్నారు. సన్నిహితులు, ఆసుపత్రి సిబ్బంది సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు.

Balakrishna birth day celebrationa in Telangana and AP

కాగా, బాలకృష్ణ జన్మదిన వేడుకలు బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ బాధిత చిన్నారులతో కలిసి బ్రాహ్మణి కేక్‌ కట్‌ చేశారు.

బాలకృష్ణ జన్మదినం సందర్భంగా అభిమానులు, టిడిపి కార్యకర్తలు విజయవాడలో మొక్కలు నాటారు. ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, స్థానిక ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వర రావు, గద్దె రామ్మోహన్‌ రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలకృష్ణ అభిమానులను మంత్రి అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+