వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూత్ వద్ద బాలకృష్ణ ప్రచారం: కాపు అరెస్ట్, టియర్ గ్యాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna campaign at Polling booth: YSRCP
అనంతపురం: హీరో, తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మైలాపురం క్రాస్ పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం ప్రచారం నిర్వహించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాలయ్య ప్రచారం చేశారని వారు ఆరోపించారు.

కాపు అరెస్ట్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డిని రాయదుర్గంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌‍కు తరలించారు. ఆ సమయంలో షాడో పార్టీ పోలీసులతో ఆయన గొడవకు దిగారు.

టియర్ గ్యాస్ ప్రయోగం

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని రెడ్డివారిపల్లెలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి స్వగ్రామమైన రెడ్డివారిపల్లెలో జగన్ పార్టీ, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్ల దాడులకు పాల్పడ్డాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు సర్దిచెప్పినప్పటికీ రెండు వర్గాలు శాంతించకపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా యుద్ధనపూడి మండలం తోటవారిపాలెంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చినికి చినికి వానలా మారింది. ఇరువర్గాలు రాళ్ల దాడులకు దిగాయి. ఒక వర్గంపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

English summary

 Balakrishna campaign at Polling booth: YSRCP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X