బాబు బాధ్యత వట్టిదే: హిందూపురం నుంచే బాలయ్య
అనంతపురం: వచ్చే ఎన్నికల్లో సినీనటుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి శాసనసభకు పోటీచేయనున్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని ఆయన చెబుతున్నారు. అయితే, ఇప్పటికే బాలయ్య తాను పోటీ చేసే స్థానాన్ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 14వ తేదీ హిందూపురం టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. లెజెండ్ విజయోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి హిందూపురం చేరుకున్న బాలయ్య తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేస్తానని అభిమాన సంఘాల ప్రతినిధులతో బాలయ్య సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 14న నామినేషన్ వేసేందుకు వస్తానని ఏర్పాట్లు చేయాలని అభిమానులకు సూచించినట్లు సమాచారం.

అవకాశం ఇస్తే హిందూపురంనుంచి పోటీ చేస్తానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. కర్నూలులో శుక్రవారం లెజెండ్ చిత్ర విజయోత్సవ రోడ్‌షో నిర్వహించిన సందర్భంగా ఆ విషయం చెప్పారు. ఆయా జిల్లాల అభిమానులు తమ ప్రాంతంనుంచి ఎన్నికల్లో పోటీ చే యాలని కోరుతున్నారన్నారు. హిందూపురం నుంచి పోటీ చేయాలని అభిమానులు, నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేదానిపై అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. ఇదే విషయమై పార్టీ అధినేత చంద్రబాబుతో విజయోత్సవ యాత్ర ముగింపు అనంతరం భేటీ అవుతానని బాలకృష్ణ తెలిపారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications