జూ ఎన్టీఆర్‌పై బాలయ్య ఘాటు వ్యాఖ్య, 'సిఎం' వద్దనను

తాను హిందూపురంను నెంబర్ వన్ నియోజకవర్గంగా చేస్తానని బాలయ్య చెప్పారు. తనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు కేవలం తండ్రే కాదని... గురువు, దైవం అన్నారు. తాను ప్రజాసేవకు తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తన నామినేషన్‌కు వేలాదిమంది తరలి రావడం సంతోషం కలిగించిందన్నారు. హిందూపురంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు.
హిందూపురంలో బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానన్నారు. అనంతపురం జిల్లాకు తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పారు. అయితే, ఏవో పదవులు ఆశించి తాను రాజకీయాల్లో రాలేదన్నారు. పార్టీ, ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా చేసేందుకు అవకాశం వస్తే మాత్రం కాదనని బాలకృష్ణ చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాల్లేవన్నారు.
గుర్తు తెచ్చుకోండి: విజయమ్మ
వైయస్ ఆశయాలు జగన్ వల్లే సాధ్యమని వైయస్సార్క కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేరుగా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో వైయస్సార్ జనభేరి పేరిట ఎన్నికల శంఖారావం పూరించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని ఆకాంక్షించాలని, ఓటేసే ముందు ఒక్కసారి వైయస్ పాలనను గుర్తు తెచ్చుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications