గన్నవరం నుంచి అసెంబ్లీకి హీరో బాలకృష్ణ పోటీ

పార్టీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. గన్నవరం టిడిపి ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావుకు కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ డైరీ(విజయ డైరీ) పాలక మండలిలో చోటు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బావ మరిది అయిన నందమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడని పార్టీ వర్గాలంటున్నాయి.
గన్నవరం నియోజవర్గంలో కమ్మ వర్గం బలంగా ఉన్న కారణంగా అక్కడ్నుంచి పోటీ చేస్తే గెలవడం ఖాయమన్న భావనతో బాలకృష్ణ ఆ స్థానం నుంచే పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. లోకసభకు పోటీ చేయడానికి బాలకృష్ణ సిద్ధంగా లేరు. తాను శానససభకే పోటీ చేస్తానని పలుమార్లు చెప్పారు కూడా.
గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాలకృష్ణ గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రత్యర్థి పార్టీపై 10శాతం ఓట్ల మెజార్టీతో బాలవర్ధన్ రావు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అంతగా ప్రభావం చూపలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా జిల్లా డైరీ పాలక మండలిలో బాలవర్ధన్ రావుకు చోటు కల్పించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications