బెజవాడలో పురంధేశ్వరి: విశాఖపట్నంలో బాలయ్య
విశాఖపట్నం: తాజాగా నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. శాసనసభకు పోటీ చేస్తానని చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. హిందూపురం నుంచి బాలకృష్ణ శాసనసభకు పోటీ చేస్తారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.
ఉత్తరాంధ్రపై బాలకృష్ణ మొదటి నుంచి దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా వుండడంతో తెలుగుదేశం పార్టీ అవిర్భావ సమయం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా వుంది. ఈ నేపధ్యంలోనే బాలకృష్ణ క్రియాశీలక రాజకీయల్లోకి వచ్చిన సమయంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బాలయ్య ఇక్కడి నుంచి పోటీచేస్తే తాను రాజీనామా చేస్తానంటూ చెప్పారు.

అయితే బాలయ్య మాత్రం, తన దైన శైలిలో విశాఖలో తమ ప్రభావం పెరిగే విధంగా కృషి చేశారు. ముఖ్యంగా విశాఖపైన దృష్టి పెట్టిన ఆయన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక కార్యక్రమాల్లో తరు చుగా ఇక్కడకు వచ్చి వెళ్తుండేవారు. అదీ కాకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వ హించి పాదయాత్ర ముగింపు కార్యక్రమం కూడా విశాఖనగరంలోనే నిర్వహించడం గమనార్హం.
రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లోను పాదయాత్ర చేసిన చంద్రబాబు, ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖనగరంతోనే తమ పాదయాత్రను ముగించి పైలాన్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య కీలక పాత్ర పోషించారు. కాగా ఈ ప్రాంతం నుంచే పోటీచేసేందుకు ఉత్సాహత చూపించిన బాలయ్య, అందరి ఆలోచనలను కాదని, విశాఖ పార్లమెంట్ స్ధానం నుండి పోటీ చేసేం దుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. గతంలో ఆయన సోదరి మాజీ కేంద్ర మంత్రి పురం దీశ్వరి కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసినప్పటికీ, ఆమె ఎన్టీఆర్ కూతురిగానే ఇక్కడ ప్రజలు ఆదరించారు. అందుకే ఎన్టీఆర్ కుమారుడిగా విశాఖలో పోటీ చేస్తే తనను ప్రజలు ఆదరిస్తారని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల తన సోదరి, విశాఖ సిట్టింగ్ ఎంపీ పురందీశ్వరి చేరారు. ఆమె విశాఖ నుంచి కాకుండా విజయవాడ నుంచే పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విశాఖను బాలయ్య ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఎంవివిఎస్ మూర్తి, బాలయ్య ఒక్కడ ఎంపీ టిక్కెట్టు ఆశిస్తున్నారని తెలుసుకుని వ్యూహాత్మకంగా అసెంబ్లీ టిక్కెట్టు ఆశిస్తున్నారని పలువురు అన్నారు.












Click it and Unblock the Notifications