బాలయ్య నామినేషన్, జనసంద్రం: రాయపాటికి ఝలక్
అనంతపురం/గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ బుధవారం ఉదయం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం స్థానిక సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
కాగా, బాలకృష్ణను చూసేందుకు హిందూపురంతో పాటు చుట్టుపక్కల వారు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో హిందూపురం రోడ్లు జనసంద్రమయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు రోడ్ల మీదే కాకుండా బిల్డింగులు, చెట్లపైకి ఎక్కి బాలయ్యకు అభివాదం చేస్తున్నారు. బాలయ్యపై పూల వర్షం కూరిపించారు.య

రాయపాటికి తమ్ముళ్ల షాక్
రాయపాటి సాంబశివ రావుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన నర్సారావు పేటకు టిడిపి తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన బుధవారం ఉదయం నామినేషన్ వేయనున్నారు.
అయితే, ఆయనకు స్థానిక తెలుగు తమ్ముళ్ల నుండి సహకారం లభించడం లేదు. నర్సారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లడానికి రాయపాటియే కారణమని ఆరోపిస్తూ టిడిపి ముఖ్య నేతలు ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications