సిఎం అయ్యే అర్హత బాలకృష్ణకు ఉంది: షబ్బీర్, బాబుపై ఫైర్
హైదరాబాద్: నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుడు షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీ రామారావు కుమారుడిగా ముఖ్యమంత్రి అయ్యే అర్హత బాలకృష్ణకు ఉందని ఆయన అన్నారు.
వాస్తు బాగా లేదని ఇళ్లు మారుతున్న చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారని ఆయన అడిగారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. విద్యుత్తు, నదీ జలాల పంపిణీ, ఎంసెట్‌లపై ఆంధ్ర పెత్తనమేమిటని ఆయన అడిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆయనకే లాభం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు అన్నీ ఇబ్బందులేనని ఆయన అన్నాకుయ
నోరు పారేసుకోవద్దని కెటిఆర్‌కు సలహా

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావుపై కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర లోకసభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. నోరు పారేసుకోవద్దని, వ్యక్తిగత దూషణలకు దిగవద్దని ఆయన సలహా ఇచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం విషయంలో తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన గురువారం మీడియాతో అన్నారు. కాంగ్రెసుపై తెలంగాణ మంత్రులు ఎదురు దాడి చేయడం సరి కాదని ఆయన అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అసలు అభివృద్ధే జరగలేదని, నేతలంతా ఒళ్లు పెంచారని మంత్రి కెటిఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా అదనంగా గ్రామాలకు ఒక్క చుక్క మంచినీరు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా వాటర్ గ్రిడ్‌ను చేపట్టాలని ఆయన సూచించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు నుంచే వలసలను ప్రోత్సహించడం కెసిఆర్‌కె శాపమని ఆయన అన్నారు. అన్నం పెట్టిన తల్లి సోనియాకు కెసిఆర్ ద్రోహం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
భూములు అమ్మితే సహించం
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మినహా ఇతర తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వ భూములు అమ్మితే సహించబోమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన గురువారం మీడియాతో అన్నారు. పార్టీ ఫిరాయించిన శానససభ్యులపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications