మనతో పెట్టుకుంటే ఎవరైనా మటాష్: బాలకృష్ణ, జగన్‌కు కోర్టులకే టైం
అమరావతి: తెలుగుజాతితో పెట్టుకుంటే ఎవరైనా మటాష్ అవ్వాల్సిందేనని హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ మహా సంకల్పం దీక్షలో అన్నారు. రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారని, ఆయనకు అందరు సహకరించాలన్నారు.
సమర్థుడైన నాయకుడు మనకు ఉన్నారన్నారు. ఆంధ్రుల చరిత్రను తిరగరాసేందుకు టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ చంద్రబాబు హామీలు అమలు చేస్తున్నారన్నారు. నదుల అనుసంధానం, రుణమాఫీ, రాజధాని నిర్మాణంతో బాబు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు.
నిలువునా చీల్చారు: కాల్వ
తెలుగు జాతిని కాంగ్రెస్ పార్టీ నిలువునా చీల్చిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

ద్రోహం చేసిన కేసీఆర్ కు జగన్ బాసట: కామినేని
ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన కేసీఆర్‌కు జగన్ బాసటగా నిలుస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నారు. అభివృద్ధిని జగన్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ప్రపంచంలో గుర్తింపు పొందిన నేత బాబు: మండలి
ప్రపంచంలో గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబు అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలన్నారు.
జగన్‌కు కోర్టుకే సమయం: యనమల
టీడీపీని తట్టుకోలేక జగన్, కాంగ్రెస్ పార్టీలు, తెలంగాణలో తెరాసలు ఏపీ అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఆ కుట్రను 13జిల్లాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబును, టీడీపీని ఎవరు ఎదుర్కోలేరన్నారు.
1984 నుండి మన పార్టీని ఎదుర్కొనే పార్టీ లేదని, ఎదుర్కొనే నాయకుడు లేడన్నారు. ఏపీని స్వర్ణాంధ్ర చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు. జగన్ పైన 11 ఛార్జీషీట్లు ఉన్నాయని, ఆయన సమయం కోర్టుకు వెళ్లేందుకే సరిపోతుందన్నారు.
తిలోదకాలు: కోడెల
పక్క రాష్ట్రంలో విలువలకు తిలోదకాలు ఇచ్చి కుట్రలు చేస్తున్నారని కోడెల శివప్రసాద రావు అన్నారు. మనకు ప్రజా బలం ఉందన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications