వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క ఛాన్స్ - ఒక్క తప్పిదం : అనుభవిస్తున్నారు - ఆలోచించండి : బాలయ్య..!!

|
Google Oneindia TeluguNews

సినీ హీరో..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అని అడగగానే..ఒక్క తప్పిదం చేసారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అనుభవిస్తున్నారని చెబుతూ..ఆత్మవిమర్శ చేసుకోవాలని..మనుషుల్లా బతకండి అంటూ సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం గుడిని..గుడిలో లింగాన్ని మింగే రకమంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి బాలయ్య నివాళి అర్పించారు. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని బాలకృష్ణ అన్నారు.

నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం

నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం


నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించామని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారన్న బాలకృష్ణ... రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లాడతానని చెప్పారు. తెనాలిలో పెమ్మసారి థియేటర్ లో ఏడాది పాటు ఎన్టీఆర్ సినిమాల ప్రదర్శనను ప్రారంభించారు. ఎన్టీఆర్ సినిమాలు ..ఆయన కుమారుడిగా తనకు దక్కిన గౌరవం మరిచిపోలేనని చెప్పారు.

ఒక్క ఛాన్స్ నినాదం నమ్మి మోసపోయారు

ఒక్క ఛాన్స్ నినాదం నమ్మి మోసపోయారు


ఎన్టీఆర్ అంత మంచోడు ఏ దేశంలో అయినా పుట్టారా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఏడాది పాటు సినిమాల ప్రదర్శన.. నెలకు రెండు అవార్డులు ఇస్తున్నట్లు వివరించారు. దాన వీర శూర కర్ణ డైలాగ్ చెప్పిన బాలయ్య.. విలువ పుట్టిన మనిషికి కానీ, కులానికి కాదని అందరూ గుర్తించాలని సూచించారు. అందరికీ భవిష్యత్ ఉండాలని బాలయ్య ఆకాంక్షించారు. యువత భవిష్యత్ కోసమే తన తపన అని చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలు ప్రపంచంలోని ఏ పార్టీకి లేరని చెప్పారు. ఆస్తులు - ప్రాణాలు లెక్క చేయకుండా పార్టీ కోసం పని చేస్తున్నారంటూ అభినందించారు. కార్యకర్తల అంకితభావానికి ధన్యవాదాలు చెప్పారు.

ఆత్మవిమర్శ చేసుకోండి

ఆత్మవిమర్శ చేసుకోండి


ఇప్పుడు రాష్ట్రం చూస్తుంటే ఎలాంటి ఏపీ ఎలా అయిపోయిందనే బాధ కలుగుతోందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ఎన్టీఆర్​ ముందుకొచ్చారని గుర్తుచేశారు. దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టి అనే విధంగా రాష్ట్ర పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఓటు వేసే దాకే సందడి.. ఓటుతోనే ఉంది రాజకీయం ముడిపడి.. ఓటు సరిగ్గా వేస్తేనే గుడి -బడి అని చెప్పుకొచ్చారు. కులాలను ఏ రకంగా వాడుకుంటున్నారో చూస్తున్నామని బాలయ్య పేర్కొన్నారు. తెలుగు వారందిరినీ కలిపిన శక్తి.. ఒక్క కుటుంబంగా ఉంచిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ బాలకృష్ణ నివాళి అర్పించారు.

English summary
MLA Balakrishna sensational comments against YSRCP govt, Paid tirbutes to his father NTR on his birth day in Nimmakur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X