బాబుకి చిక్కు: బాలకృష్ణ మంత్రి పదవి అడుగుతున్నారా? రేసులో భూమా

విజయవాడ: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ మంత్రి పదవి రేసులో ఉన్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయలేదు.

రానున్న జూన్ నెలలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా రేసులో బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. నిన్నటి వరకు నారా లోకేష్ పేరు కూడా వినిపించింది. ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

Balakrishna

తనకు క్యాబినెట్ బెర్త్ కావాలని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారనే పుకార్లు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరిగితే పల్లె రఘునాథ రెడ్డిని తప్పించవచ్చంటున్నారు. సొంత జిల్లా అధికారులపై సైతం ఆయన పట్టు సాధించలేకపోయారని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఆయనతో పాటు పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత పైనా ఆయన కోపంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఆమె పదవికి ఢోకా లేదని తెలుస్తోంది. మంత్రి పదవి రేసులో బాలకృష్ణతో పాటు ఇటీవలే టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు పోటీలో ఉన్నారు. లోకేష్ లేదా బాలకృష్ణకు బెర్త్ దక్కవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+