బాలయ్యకు చంద్రబాబు షాక్: అశోక్ గజపతి రాజుకు ఛాన్స్
హైదరాబాదు: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే ఆ స్థానంలో ఎన్టీ రామరావు తనయుడు నందమూరి బాలకృష్ణ కూర్చుంటారనే ఊహాగానాలు ఇప్పటి వరకు కొనసాగతూ వచ్చాయి. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ప్రముఖ ఆన్ లైన్ పత్రిక ముంబై మిర్రర్ కథనం మరో రకంగా ఉంది.
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో రాజీనామా చేయాల్సి వస్తుందా, లేదా అనేది స్పష్టంగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితే ఉంది. అయితే చంద్రబాబు రాజీనామా చేయాల్సి వస్తే ఏమవుతుందనే విషయంపై జాతీయ మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తన స్థానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కూర్చొబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రముఖ ఆన్‌లైన్ పత్రిక ముంబై మిర్రర్ సోమవారం ఒక కథనం రాసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ, బీజీపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా దృష్టికి కూడా తీసికెళ్లినట్లు సమాచారం ఉందని ఆ పత్రిక వెల్లడించింది.

రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబు పేరును ఏసీబీ చేర్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబు సీఎం కుర్చీ వదులుకోక తప్పదు. ఈ మేరకు స్పష్టమైన సిగ్నల్స్ వస్తుండడంతో తన వారసునిపై బాబు తర్జన భర్జన పడుతున్నారు. ఆ రాష్ట్ర డీజీపీ, ఇంటలిజెన్స్ విభాగాలతో ప్రత్యేకంగా సమాలోచనలు చేస్తున్నారు.
అశోక్‌గజపతివైపే సీఎం పోస్టుకు అర్హుడనే విషయం చంద్రబాబు కేంద్రానికి చెప్పినట్లు తెలిసి ఆ పార్టీలోని ఇతర నాయకులు సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు వియ్యంకుడు, ఎన్టీఆర్ తనయుడైన బాలకృష్ణ, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి నారాయణ పేర్లు కూడా చర్చల్లో వచ్చాయని ఆన్‌లైన్ పత్రిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications