అమరావతి రైతులకు అండగా బాలకృష్ణ: పండుగకు చంద్రబాబు దూరం: పోరాటానికి మద్దతుగా..!
మూడు రాజధానులు..పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపు ప్రతిపాదనల పైన అమరావతిలో నిరసనలు హోరెత్తుతున్నాయి. స్థానిక మహిళలు..రైతులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల దీక్షల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. జనసేన అధినేత పవార్టీలున్ సైతం రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అధికార వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు రైతుల పోరాటానికి మద్దతుగా..అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఇక, ఇప్పుడు సినీ హీరో...హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సైతం సంక్రాంతి నాడు రైతుల కు మద్దతుగా అమరావతికి వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భువనేశ్వరి..నందమూరి రామకృష్ణ సైతం రైతుల వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండాలని.. ప్రతీ ఏటా నారా వారి పల్లెకు వెళ్లే నారా..నందమూరి కుటుంబాలు ఈ సారి అమరావతిలో రైతులతో ఉండాలని నిర్ణయించారు.
రైతులకు మద్దతుగా బాలకృష్ణ..
రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించలేదు. టీడీపీ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు రైతులు చేస్తున్న ఆందోళనల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. జనవరి 1న సతీ సమేతంగా చంద్రబాబు అక్కడ రైతుల దీక్షల్లో పాల్గొన్నారు. భువనేశ్వరి తన చేతికి ఉన్న ప్లాటినం గాజులను సైతం ఉద్యమానికి విరాళం గా అందించారు. రాయలసీమ టీడీపీ నేతలు సైతం అమరావతి రాజధానిగా కొనసాగించాలని లేకుంటే..తమకు ప్రత్యేక గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు రాయలసీమ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సైతం అమరావతి రైతులకు మద్దతుగా సంక్రాంతి పండుగ రోజుల్లో రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని సమాచారం. పార్టీ అధినేతతో కలిసి ఆయన కుటుంబ సమేతంగా రైతుల దీక్షల వద్దకు వెళ్లి..వారికి మద్దతు ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

సంక్రాంతి పండుగకు దూరం
సంక్రాంతికి నారావారిపల్లె వెళ్లే కార్యక్రమాన్ని టీడీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి వేడుకల్లో నారా..నందమూరి కుటుంబాలు పాల్గొంటాయి. అయితే, ఈ సారి అమరావతిలో రైతులు ఆందోలనళ్లో ఉండటంతో తాము సైతం సంక్రాంతికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. నారావారి పల్లెలోనే మూడు రోజుల పాటు ఉండి అక్కడే పండుగ ను ఈ రెండు కుటుంబాలు కలిసి నిర్వహించేవి. ఈ సారి సంక్రాంతి వేడుకలకు సొంతూరు వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోనే ఉండి రైతులకు సంఘీభావం ప్రకటించాలని బాబు నిర్ణయించారు. పండుగ రోజున సైతం రైతులతో కలిసి దీక్షలకు మద్దతు ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేడకులకు సైతం చంద్రబాబు దూరంగా ఉన్నారు. పార్టీ సైతం కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించలేదు.
-
చిరంజీవి - బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు!












Click it and Unblock the Notifications