వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు నమస్కారం, బాలకృష్ణ, కవిత పరామర్శ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధానిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పలువురు పరామర్శించారు. బాబు బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం బాబును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు సోమవారం ఉదయం పరామర్శించారు. టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో బాబును పరామర్శించేందుకు వచ్చారు. మరోవైపు బాబు ఆరోగ్యం కుదుటపడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతోందని, మంగళవారం కాలేయ సంబంధిత పరీక్షలు జరపనున్నట్లు చెప్పారు.

బాబుకు చక్కెర నిల్వలు సాధారణ స్థాయికి వచ్చాయని, కామెర్ల వ్యాధికి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోందని తెలిపారు. బాబును పరామర్శించిన వారిలో బాలకృష్ణ, శంకర రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నటి, టిడిపి నేత కవిత తదితరులు ఉన్నారు. బాబు త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఢిల్లీలో బాబు

ఢిల్లీలో బాబు

ఆదివారం డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బయటకు తీసుకు వస్తున్న దృశ్యం.

బాబు నమస్కారం

బాబు నమస్కారం

డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బయటకు వస్తూ నమస్కరిస్తున్న దృశ్యం.

విలేకరులతో

విలేకరులతో

డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నమస్కారం.

సమావేశంలో బాబు

సమావేశంలో బాబు

డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

విలేకరుల సమావేశం అనంతరం

విలేకరుల సమావేశం అనంతరం

డిశ్చార్జి అనంతరం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుండి బయటకు వస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

శంషాబాద్

శంషాబాద్

ఢిల్లీ నుండి హైదరాబాదుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును శంషాబాద్ విమానాశ్రయం వద్ద అంబులెన్సులోకి ఎక్కించారు.

ముగ్గురు బాబులు!

ముగ్గురు బాబులు!

శంషాబాద్ విమానాశ్రయం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ఫోటోలతో స్వాగతం పలుకుతున్న తమ్ముళ్లు. మూడు రకాల చిత్రాలతో వారు స్వాగతం పలికారు.

అంబులెన్సులోకి

అంబులెన్సులోకి

ఢిల్లీ నుండి హైదరాబాదుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును శంషాబాద్ విమానాశ్రయం వద్ద అంబులెన్సులోకి ఎక్కించారు.

ఆసుపత్రి

ఆసుపత్రి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేరుగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రికి తీసుకు వచ్చారు.

బాబు పక్కన భువనేశ్వరి

బాబు పక్కన భువనేశ్వరి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలోకి తీసుకు వెళ్తుండగా సతీమణి భువనేశ్వరి.

బాలకృష్ణ

బాలకృష్ణ

హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

కవిత

కవిత

ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నటి, టిడిపి నేత కవిత పరామర్శించారు.

English summary

 Telugudesam leader and Hero Nandamuri Balakrishna met TDP chief Nara Chandrababu Naidu on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X