వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబినెట్: బాబుతో బాలకృష్ణ భేటీ, ఆశీస్సులని రాయపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హీరో, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ గురువారం కలిశారు. కాగా, ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్యకు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఖారరైనట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు కూడా తన కేబినెట్ పైన కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 Balakrishna meets Chandrababu

ఆనందీకి చంద్రబాబు శుభాకాంక్షలు

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆనందీ కూడా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు.

స్వామి ఆశీస్సులుంటే: రాయపాటి

తిరుమలకు రావాలి అంటే ఆ స్వామి అనుగ్రహం, అనుమతి ఉంటేనే సాధ్యమవుతుందని నర్సారావుపేట నుంచి ఎంపిగా గెలుపొందిన రాయపాటి సాంబశివరావు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన గురువారం స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేతరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్తానం చైర్మన్ పదవి కావాలనే మీ కోరిక ఈ మారు తీరనుందా.. అని విలేకరులు ప్రశ్నిస్తే ఆయన స్పందించారు. కోరికలు అందరికీ ఉంటాయని, ఆ కోరికలు తీరాలన్నా, స్వామి దర్శనం కావాలన్నా ఆయన అనుగ్రహం అవసరమన్నారు.

English summary

 Hero Nandamuri Balakrishna meets Telugudesam Party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X