గుడివాడకు రావి: కొడాలి నానిపై బాలయ్య కాదు

విజయవాడ: జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమారుడు, నందమూరి హీరో బాలకృష్ణ పోటీ చేయడం లేదనే విషయం స్పష్టమైంది. గుడివాడ శాసనసభా నియోజకవర్గంలో కొడాలి నానిపై రావి వెంకటేశ్వర రావు పోటీ చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం సీమాంధ్ర పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారంనాడు ప్రకటించారు.

తొలి జాబితాలో బాలకృష్ణ పేరు చోటు చేసుకోలేదు. అయితే, పార్టీని వీడి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొడాలి నానిపై బాలకృష్ణ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. కొడాలి నాని పార్టీ మారిన సంఘటన జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రభావం చూపింది. జూనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబుతోనూ బాలకృష్ణతోనూ దూరం పెరిగింది.

Balakrishna not contesting Gudivada

వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీ చేసి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో బాలకృష్ణ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా కొడాలి నాని పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో ఆయనను ఓడించడమే లక్ష్యంగా బాలకృష్ణ పనిచేస్తారని వార్తలు వచ్చాయి.

కాగా, బాలకృష్ణ హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇదే సీటును ఆయన సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా ఆశిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ కృష్ణా జిల్లా పలమనేరు సీటు నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగింది. పలమనేరు సీటుకు కూడా చంద్రబాబు బుధవారం అభ్యర్థిని ప్రకటించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+