బాలకృష్ణ క్రికెట్: అమ్మాయితో ఎమ్మెల్యే చిందులు

విజయవాడ: సంక్రాంతి పండుగను సొంతజిల్లా కృష్ణాలో చేసుకున్న బాలకృష్ణ శనివారంనాడు తన నియోజకవర్గం హిందూపురంలో సందడి చేశారు. బసవతారకరామారావు స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ను బాలయ్య ప్రారంభించారు. యువకులతో కలిసి కాసేపు ఉత్సాహంగా క్రికెట్‌ ఆడారు. క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలని వారికి సూచించారు.

తూర్పు గోదావరి జిల్లా పిగన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తనలోని కళానైపుణ్యాన్ని చూపించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమలో ఏర్పాటు చేసిన సంగీత విభావరికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన పాటలు విని ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒక్కసారిగా స్టేజ్‌పైకి ఎక్కి ఓ అమ్మాయి చేయిపట్టుకుని స్టెప్పులేసి సందడి చేశారు.

Balakrishna plays cricket at Hindupur

తూర్పు గోదావరి కోనసీమలో సంక్రాంతి సంబరాలు శృతిమించాయి. రాజోలు దీవి సంబరాలలో అశ్లీల నృత్యాల్లో అందరూ మునిగి తేలారు. మామికుదురు, మల్కిపురం, సకినేటి మండలాల్లో గ్రామపెద్దలు, అధికారులు దగ్గరుండి మరీ ఈ అశ్లీల నృత్యాలను తిలకించారు.

ఇదిలావుంటే, సంక్రాంతి దాటినా గోదావరి జిల్లాల్లో పలు చోట్ల కోడిపందాలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి డివిజన్‌లో ప్రజాప్రతినిధుల అండ, పోలీసుల సహకారంతో పందెం రాయుళ్లు పందాలను కొనసాగిస్తున్నారు. లక్షల్లో బెట్టింగులు సాగుతోంది. కోడిపందాల శిబిరాల దగ్గర గుండాట నిర్వహిస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. గోకవరం, రాజనగరం మండలాల్లోని పలు గ్రామాలలో పందాలు జోరుగా సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+