టిలో బాలకృష్ణ పుష్కర స్నానం, కేసీఆర్‌కి కితాబు, సిక్కోలులో చిరు సందడి

మహబూబ్ నగర్/శ్రీకాకుళం: హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లా సోమశిల వద్ద పవిత్ర పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ఆయన పూజలు చేశారు.

ఆయు కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రధానం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమశిల పుష్కర ఘాట్ వద్ద ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సోమశిల వద్ద భవిష్యత్తులో సినిమా చిత్రీకరణకు ప్రయత్నిస్తామన్నారు.

 Balakrishna Pushkara bath in Mahaboobnagar and praises KCR government

వీవీఎస్ లక్ష్మణ్ పుష్కర స్నానం

న‌ల్గొండ జిల్లాలోని అడ‌విదేవులప‌ల్లిలో ఏర్పాటు చేసిన పుష్క‌రఘాట్‌లో టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పుష్కర స్నానం ఆచరించారు. కుటుంబ‌ స‌భ్యులతో క‌లిసి హైద‌రాబాద్ నుంచి అడ‌విదేవులప‌ల్లికి వ‌చ్చిన పుణ్య స్నానం చేశారు. అనంత‌రం అక్క‌డి సూర్య దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

శ్రీకాకుళంలో దేవీ ఆశ్రమంలో చిరంజీవి

సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురువారం నాడు శ్రీకాకుళంలో సందడి చేశారు. 150వ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి శ్రీకాకుళం సమీపంలో కోర్మయ్యపేటలో గల దేవీ ఆశ్రమంలో రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు.

ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఆశ్రమం వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కర శర్మ రుద్రాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+