కాలేజీ రోజుల్లా ఉందన్న బాలకృష్ణ, సినిమాలు చేస్తానని..
హైదరాబాద్: శాసన సభకు ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తుంటే కాలేజీ రోజులు గుర్తుకు వస్తున్నాయని హీరో, అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన పిచ్చాపాటీగా మాట్లాడారు.
కాలేజీ రోజుల్లో తెలియని విషయాలు తెలుసుకునే వారమని.. ఇప్పుడు శాసన సభలో కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు.
శాసన సభకే సమయం సరిపోతున్నట్లుగా ఉందని, సినిమాల సంగతేమిటని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ... సినిమాలు చేస్తానని, ఈ నెల 30వ తేదీ నుండి సినిమా షూటింగ్ షెడ్యూలు ప్రారంభం కానుందని చెప్పారు.

అలాగే, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో విశ్వవిద్యాలయం నెలకొల్పాలని సూచించానని చెప్పారు. హిందూపురం నుండి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.
కాగా, హీరో నందమూరి బాలకృష్ణ ఈసారి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో నేర్చుకోవాల్సింది ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications