చంద్రబాబుకు బాలయ్య తలనొప్పి: మొదటిసారేం కాదు...

నంద్యాల ఉప ఎన్నికలో గ్లామర్ ఉపయోగపడుతుందని భావిస్తే హీరో బాలకృష్ణ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పి కలిగించే చర్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలో గ్లామర్ ఉపయోగపడుతుందని భావిస్తే హీరో బాలకృష్ణ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పి కలిగించే చర్యకు పాల్పడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై ప్రచారంలో బాలయ్య తీవ్రంగానే విరుచుకుపడ్డారు.

అంత వరకు ఫరవా లేదు. కానీ ఆయన అభిమానిపై చేయి చేసుకోవడం వివాదంగా మారింది. అది ఆయన చేసిన ప్రచారాన్ని ద్వితీయం చేసినట్లుగా భావిస్తున్నారు. అంతేకాదు, ఆయన నోట్లు పంచుతున్నట్లు వైరల్ అవుతున్న ఫొటోలు కూడా చిక్కులను తెచ్చి పెట్టే విధంగానే ఉన్నాయి.

బాలయ్య అభిమానులపై విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ కొన్ని సంఘటనలు జరిగాయి. ఆయన సహనం కోల్పోయి వివాదాన్ని కొని తెచ్చుకోవడం ఆనవాయితీగా మారిందని అంటున్నారు.

చెంప చెళ్లుమనిపించారు..

చెంప చెళ్లుమనిపించారు..

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం కోసం వెళ్లిన బాలయ్య బుధవారం రాత్రి ఓ కార్యకర్త చెంపపై కొట్టారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారం ముగిసిన తర్వాత బాలకృష్ణ రాత్రి బస కోసం లాడ్జి వద్దకు వచ్చినప్పడు అభిమానులూ కార్యకర్తలూ గుంపుగా వచ్చారని, బాలయ్యకు గజమాల వేసే సమయంలో ఓ కార్యకర్త పైపైకి దూసుకొస్తూ కాలు తొక్కడాని అంటున్నారు. దాంతో అప్పటికే ప్రచారంతో అలసిపోయిన బాలకృష్ణ ఆ నొప్పిని తట్టుకోలేక అతన్ని కొట్టాడని అంటున్నారు.

Recommended Video

    Nandyal By Polls : Balakrishna Targets YS Jagan In Road Show | Oneindia Telugu
    వైసిపికి అస్త్రం...

    వైసిపికి అస్త్రం...

    నంద్యాల ఉప ఎన్నిక పోలింగు సమీపిస్తున్న సమయంలో ప్రచారానికి వెళ్లిన బాలకృష్ణ స్థానిక కార్యకర్తను కొట్టడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రచారాస్త్రంలా మారింది. బాలకృష్ణ ఏం మాట్లాడుతారో, ఆయనకు ఎప్పుడు ఎలా కోపం వస్తుందో ఎవరికీ తెలియదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు.

    చంద్రబాబుకు తలనొప్పే...

    చంద్రబాబుకు తలనొప్పే...

    ఎంతగా సర్దిచెప్పినప్పటికీ బాలయ్య వ్యవహారం తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత నష్టం చేస్తుందని అంటున్నారు. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారిందనే ప్రచారం సాగుతోంది. అక్కడ ఏం జరిగిందో, ఎందుకు కార్యకర్తను బాలయ్య కొట్టాడో ఎవరికీ అవసరం లేదు.

    ఆ సమయంలో...

    ఆ సమయంలో...

    ‘గౌతమిపుత్రి శాతకర్ణి' సినిమా విడదల సమయంలో ఓ థియేటర్ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన అభిమాని సెల్‌ఫోన్‌ను బాలయ్య లాక్కుని పగులగొట్టారు. ఇటీవల తన 102వ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవంనాడు అసిస్టెంట్‌ను కొట్టారు. ఈ రెండింటికి సంబంధించి ఫొటోలు, వీడియోలు కూడా ఇప్పటికీ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. నంద్యాలలో జరిగిన తాజా సంఘటన తీవ్ర సంచలనానికి కారణమైంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+