బ్లడ్‌లోనే పొలిటిక్స్: ఎన్నికలకు బాలయ్య డైలాగ్
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు, లోకసభ ఏకకాలంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ లెజెండ్ సినిమా విడుదలవుతోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో పంచ్ డైలాగులు ఉన్నట్లు చెబుతున్నారు. బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. తన ప్రచారానికి పనికి వచ్చే విధంగా లెజెండ్ సినిమా సంభాషణలకు మసాలా దట్టించినట్లు చెబుతున్నారు.
ఈ స్థితిలో లెజెండ్ సినిమా బాలకృష్ణ రాజకీయాలకు దోహదం చేస్తుందా, లేదా అనే చర్చ జరుగుతోంది. బాలయ్య తండ్రి ఎన్టీ రామారావు నాదేశం అంటూ తీసి జనాల్లోకి వచ్చి విజయం సాధించాడు. అయితే బాలయ్య ఇంతకుముందే వియ్యంకుడు చంద్రబాబు ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు.

ఈసారి రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాలనే దృష్టిలో పెట్టుకుని వస్తున్నాడని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించాలనే దృష్టితో కూడా ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా కొన్ని సంభాషణలను రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకుని రాసినట్లు చెబుతున్నారు.
"రాజకీయం నీ ఫుడ్డులో ఉంది. బెడ్డులో ఉంది. కానీ అది నా బ్లడ్డులోనే ఉందిరా.." అంటూ విలన్‌తో బాలయ్య చెప్పే పంచ్ డైలాగ్‌లు టీజర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సంభాషణలు ఏ రాజకీయ పార్టీకి తగిలినా, తగలకపోయినా ప్రజల్లోకి సూటిగా దూసుకెళ్తే చాలుననే ఉద్దేశంతో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. లెజెండ్ సినిమా ఈ నెల 28వ తేదీన విడుదలవుతోంది. అనూహ్యంగా జగపతి బాబు ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.
లెజెండ్ సినిమా విడుదల నాటికి రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కుతాయి. దాంతో ఆ సినిమా రాజకీయాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications