హీరో బాలకృష్ణ 'లయన్' సినిమా కారు చోరీ

హైదరాబాద్: తెలుగు సినిమా హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లయన్ సినిమా షూటింగులో కారు చోరి జరిగింది. సినిమా షూటింగులో బాలకృష్ణ వాడుతున్న కారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు.
ఆ కారును ఎత్తుకెళ్లిన విషయంపై రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. షూటింగ్ స్పాట్ లోనే కారు చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
ఎస్.ఎల్. వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న లయన్ సినిమాకు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications