హిందూపురంలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ హల్‌చల్!
అనంతపురం: హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శనివారం నాడు హల్ చల్ చేసినట్లుగా తెలుస్తోంది. టిడిపి నాయకులతో కలిసి కార్యాలయానికి వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ వచ్చారు.
ఆయన అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. కిందిస్థాయి ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తూ, ఇలా ఉండాలంటూ హుకూం జారీ చేశారని వార్తలు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన సబ్ రిజిస్ట్రార్‌కు అందరు సహకరించాలని ఆయన సూచించారు

ఏదైనా ఇబ్బంది కలిగితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. ఆయన హెచ్చరికలతో కార్యాలయ సిబ్బంది బెంబేలెత్తిపోయారని అంటున్నారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications