ఏపీలో 'జూనియర్' రాజకీయం, వారసత్వపోరు: హరికృష్ణకు బాలకృష్ణ కౌంటర్!
విజయవాడ: నందమూరి హీరోల మధ్య కోల్డ్ వార్ కనిపిస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల నందమూరి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలకు, తాజాగా రెండు రోజుల క్రితం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అలాగే ఉందని అంటున్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యలు హరికృష్ణకు కౌంటర్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నాన్నకు ప్రేమతో ఆడియో సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి అంశ అని, ఆయన ఓ హిందీ చిత్రంలోను జూనియర్ నటించారని చెప్పారు.

తద్వారా సీనియర్ ఎన్టీఆర్‌కు జూనియర్ కూడా వారసుడు అని చెప్పే ప్రయత్నం అందులో ఉందని అంటున్నారు. తాజాగా, బాలకృష్ణ మాట్లాడుతూ... తన కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు పోషించానని, జానపదాలు, పౌరాణికాలు, సోషియో ఫాంటసీ చిత్రాలు.. ఇలా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించానని చెప్పారు.
తద్వారా తన తండ్రిలా ఎన్నో విభిన్న సినిమాల్లో చేశానని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ... తనకు మరెవ్వరూ పోటీ కాదని, నేను బతికున్నంత వరకు సినిమాలు చేస్తుంటానని, నా వారసత్వంగా నా కొడుకు కూడా సినిమాలు చేస్తాడనని... తన వారసుడిని ప్రకటించారు. ఇవి హరికృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ అని భావిస్తున్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యలు ఆసక్తిని పెంచాయి!
ఎన్టీఆర్ వారసుడిని నేనేనని, తన వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే వస్తాడని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఈ సంక్రాంతి పోరును మరింత ఆసక్తికరంగా మార్చాయని కూడా అంటున్నారు. టాలీవుడ్‌లో నందమూరి వారసత్వం రాజకీయ చర్చకు దారి తీసింది. మరోవైపు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇద్దరివీ.. ఈ సంక్రాంతికి విడుదలవుతుండటంతో రాజకీయ వేడి కూడా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications