ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఖాయమంటున్న బాలకృష్ణ

హిందూపురం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించబోతున్నానని నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని జేవీఎస్ ప్యాలెస్​లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించబోతున్నానని స్పష్టం చేశారు. జరిగే ఎన్నికల మహా సంఘంలో రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో ఉండే వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం భ్రష్ట పట్టించిందని మండిపడ్డారు.

balakrishna speech in Coordination Meeting of NDA Alliance Parties in Hindupur

టీడీపీ పాలనలో రాయలసీమ ఎంతో ప్రశాంతంగా ఉండేదని జగన్ ప్రభుత్వం వచ్చాక రక్తం పారిందని విమర్శించారు. మద్యపానాన్ని నిషేదిస్తామని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్.. నా అక్కలు, నా చెల్లెలు అంటూ చెబుతున్న వారికే వెన్నుపోటు పొడిచారని బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్రాన్ని మరో 10 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి రావాలని బాలకృష్ణ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందని బాలకృష్ణ అన్నారు.

రాష్ట్రానికి సుస్థిరమైన పాలన అందించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, జనసేన జిల్లా కన్వీనర్ వరుణ్, స్థానిక నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+