వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణకు మేజర్ సర్జరీ విజయవంతం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిందూపురం ఎమ్మెల్యే, ప్ర‌ముఖ సినీన‌టుడు నందమూరి బాల‌కృష్ణ కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో మేజ‌ర్ స‌ర్జ‌రీ విజయవంతంగా జ‌రిగింది.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడ్డారు. అప్పటి నుంచే ఆయ‌న రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం ప్రాథ‌మిక చికిత్స తీసుకున్నారు.

balakrishna successfully completes his shoulder surgery.

ఆ తర్వాత 'పైసా వసూల్', 'జై సింహా' వంటి చిత్రాలకు ముందుగానే కమిట్ కావడంతో సర్జరీ చేయించుకోలేక పోయారు. పైగా, ఇంతకాలం తాత్కాలిక చికిత్సతో నెట్టుకొచ్చిన ఆయన... ఇపుడు శాశ్వత పరిష్కారం కోసం చికిత్స చేసుకున్నారు. ఈ స‌ర్జ‌రీ చేసుకోవ‌డానికి బాల‌కృష్ణ శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌కి చేరుకున్నారు.

వెంట‌నే క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పుణె)ల సారథ్యంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సర్జరీ దాదాపు గంట‌సేపు జ‌రిగినట్టు వైద్యులు వెల్లడించారు.

English summary
Tollywood hero and MLA Nandamuri Balakrishna successfully completes his shoulder surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X