బాలయ్య మీమాంస: లోకసభకా, అసెంబ్లీకా?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, నందమూరి హీరో బాలకృష్ణ తన పోటీ విషయంపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు చెబుతున్నారు. లోకసభకు పోటీ చేయాలా, శాసనసభకు పోటీ చేయాలా అనే విషయంలో కాకుండా ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై కూడా ఆయన కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారని సమాచారం. బాలకృష్ణ మాత్రం మొదటి నుంచి శాసనసభకు పోటీ చేయడంపైనే ఆసక్తి చూపుతున్నారు.

బాలకృష్ణను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇందులో అనంతపురం జిల్లాలోని హిందూపురం, కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆయన పోటీ చేస్తానంటే హిందూపురం లేదా విజయవాడ లోక్‌సభ సీట్లలో ఏదైనా ఇవ్వడానికి కూడా ఆ పార్టీ సిద్ధంగా ఉంది. వీటిలో అనంతపురం జిల్లాలోని సీట్లపైనే బాలయ్య చూపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Balakrishna

ఇటీవల ఆ జిల్లాకు చెందిన అభిమాన సంఘం నేతలు తనను కలిసినప్పుడు ఆయన హిందూపురం నియోజకవర్గం రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. బాలయ్య వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా పార్టీలోని అత్యధికులు ఆయన లోకసభ సీటుకు పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే, అసెంబ్లీకి పోటీ చేయడానికే బాలకృష్ణ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తర్వాత పార్టీ వారసత్వాన్ని అందుకోవాలన్న కోరిక ఆయనకు ఉందని, ఎమ్మెల్యేగా ఉంటే అది సాధ్యపడుతుందన్న భావంతో ఆయన అటుగా ఆలోచిస్తున్నారని కొందరు అభిమాన సంఘాల నేతలు చెబుతున్నారు. మొత్తం మీద, బాలకృష్ణను పార్లమెంటుకు పంపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+