జనసేన పేరు మాదే: పవన్ కళ్యాణ్ పార్టీకి టి ఎఫెక్ట్

హైదరాబాద్: టాలీవుడ్ మెగా హీరో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ 'జనసేన' పైన అప్పుడే వివాదం ముసురుకుంది. ఆ పేరు తమదని, తాము ఆరు నెలల క్రితమే ఈ పేరును ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకున్నామని బాలరాజు అనే వ్యక్తి చెబుతున్నారు. పవన్ తన పార్టీ పేరును మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సామాజిక తెలంగాణ కోసం తాను జనసేన పేరుతో పార్టీని ఈసి వద్ద ఆరు నెలల క్రితం దరఖాస్తు చేశానన్నారు. తాము ఈ పేరును ఎట్టి పరిస్థితుల్లోను వదులుకునే ప్రసక్తి లేదన్నారు. జనసేన తాము ముందుగా రిజిస్టర్ చేసుకున్నందున పవన్ పార్టీ పేరును మార్చుకోవాలన్నారు.

Balaraju says Janasena name is mine

తాము ఆరు నెలలుగా పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. సామాజిక తెలంగాణ సాధన ఉద్దేశ్యంతో ఈ పార్టీని పెట్టినట్లు చెప్పారు. లోగో, బ్యానర్ అన్నీ తాము సిద్ధం చేసుకున్నామని చెప్పారు. తాము అనుకున్న పేరుతోనే పవన్ కళ్యాణ్ పార్టీ పేరు ఉండటం తమను షాక్‌కు గురి చేసిందని చెబుతున్నారు. ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసిన జనసేన పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిని తానేనని చెప్పారు.

కాగా, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. జనసేన పేరుతో ఈ నెల 10వ తేదీన ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు పవన్ 45 నిమిషాల పాటు పార్టీ గురించి, విధి విధానాల గురించి మాట్లాడనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+