Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలయ్య పేరు ఖరారు, జగన్‌పై సతీష్: రెండో జాబితా

హైదరాబాద్: కాంగ్రెసు నుంచి వచ్చిన నాయకులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాలో పెద్ద పీట వేశారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారికి చంద్రగిరి శాసనసభ టికెట్ ఇచ్చారు. జెసి బ్రదర్స్ ఇద్దరు కూడా టికెట్లు దక్కించుకున్నారు. జెసి దివాకర్ రెడ్డికి అనంతపురం లోకసభ స్థానం ఇవ్వగా, జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి శాసనసభా స్థానం ఇచ్చారు. రాయపాటి సాంబశివ రావుకు లోకసభ సీటును కట్టబెట్టారు. బావ మరిది బాలకృష్ణ పేరు రెండో జాబితాలో కూడా చోటు చేసుకోలేదు. అయితే, శనివారంనాడు మధ్యాహ్నం బాలయ్యకు హిందూపురం టికెట్‌ను చంద్రబాబు ఖరారు చేశారు. బాలయ్య శనివారంనాడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. స్థానిక శాసనసభ్యుడు ఘనీ, స్థానిక నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాలయ్య పేరు ఖరారు కావడంతో హిందూపురంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్ారు.

కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితో సతీష్ రెడ్డి తలపడనున్నారు. గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా గల్లా జయదేవ్ పేరును ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన వల్లభనేని వంశీకి టికెట్ దక్కింది. 40 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఆరుగురు పార్లమెంటు అభ్యర్థులతో సీమాంధ్ర ప్రాంత రెండో జాబితా విడుదలైంది.
రెండో జాబితాతో ఇప్పటి వరకు ఆ పార్టీ 12 లోక్‌సభ, 87 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. సీమాంధ్రలో 175 శాసనసభా స్థానాలు, 25 లోకసభ స్థానాలున్నాయి. గన్నవరం సిటింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావుకు ఈసారి అవకాశం దక్కలేదు. ఆ స్థానంలో వల్లభనేని వంశీకి అవకాశం దొరికింది.

Balayya seat still pending: TDP second list relesed

లోకసభ అభ్యర్థులు

1)రాజమండ్రి - మాగంటి మురళీమోహన్
2)గుంటూరు గల్లా జయదేవ్
3)నర్సరావుపేట రాయపాటి సాంబశివరావు
4)అనంతపురం జెసి దివాకరరెడ్డి
5)కడప ఆర్. శ్రీనివాసులరెడ్డి
6)నెల్లూరు ఆదాల ప్రభాకరరెడ్డి

అసెంబ్లీ అభ్యర్ధులు

1. బొబ్బిలి తెంటు లక్ష్మీనాయుడు
2. విజయనగరం - మీసాల గీత
3. శృంగవరపుకోట - కోళ్ళ లలితకుమారి
4. రామచంద్రాపురం - తోట త్రిమూర్తులు
5. కొత్తపేట బండారు సత్యానందరావు
6. నిడదవోలు - బూరుగుపల్లి శేషారావు
7. తణుకు - అరుమిల్లి రాధాకృష్ణ
8. దెందులూరు - చింతమనేని ప్రభాకర్‌రావు
9. ఏలూరు - బడేటి కోట రామారావు
10. పోలవరం - ముడియం శ్రీనివాస్
11. తిరువూరు - నల్లగట్ల స్వామిదాస్
12. గన్నవరం - వల్లభనేని వంశీ
13. మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
14. నందిగామ - తంగిరాల ప్రభాకరరావు
15. పెదకూరపాడు - కొమ్మాలపాటి శ్రీధర్
16. పొన్నూరు - ధూళిపాళ్ళ చౌదరి
17. వేమూరు - నక్కా ఆనందబాబు
18. రేపల్లె - అనగాని సత్యప్రసాద్
19. తెనాలి - ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
20. చిలకలూరిపేట - పత్తిపాటి పుల్లారావు
21. వినుకొండ - జీవీఎస్ ఆంజనేయులు
22. గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
23. ఎర్రగొండపాలెం - బుడాల అజితారావు
24. చీరాల - వావిలాల సునీత
25. ఒంగోలు- దామచర్ల జనార్ధన్
26. కందుకూరు - డాక్టర్ దివి శివరాం
27. మార్కాపురం - కందుల నారాయణరెడ్డి
28. కోవూరు - పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి
29. నెల్లూరు - అర్బన్ శ్రీధర కృష్ణారెడ్డి
30. వెంకటగిరి - కురుగొండ్ల రామకృష్ణ
31. ఉదయగిరి - బొల్లినేని రామారావు
32. పులివెందుల - సతీష్ రెడ్డి
33. మైదుకూరు - సుధాకర్ యాదవ్
34. తాడిపత్రి - జెసి ప్రభాకరరెడ్డి
35. శింగనమల - బండారు రవికుమార్
36. తంబళ్ళపల్లి - జి. శంకర్ యాదవ్
37. చంద్రగిరి - గల్లా అరుణకుమారి
38. గంగాధర నెల్లూరు - జి. కుతూహలమ్మ
39. చిత్తూరు - డికె సత్యప్రభ
40. పూతలపట్టు - ఎల్. లలితకుమారి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+