బాలకృష్ణ కాన్వాయ్‌కు ప్రమాదం : రెండు కార్లు 'ఢీ'
టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ మరోసారి ప్రమాదానికి గురైంది.
హిందూపురం : టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ మరోసారి ప్రమాదానికి గురైంది. అతివేగం కారణంగా కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీ కొన్నాయి. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజవర్గ పరిధిలోని కోడికొండ చెక్ పోస్ట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా, ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం వల్లే కాన్వాయ్ లోని కార్లు ఢీ కొన్నట్టుగా తెలుస్తోంది. ఇదే ఏడాది జూన్ లోను బెంగుళూరు సమీపంలో బాలయ్య కాన్వాయ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో కాన్వాయ్ లోని ఓ కారు బోల్తా కొట్టింది. ఇక తాజా ఘటనలో రెండు కార్లు ఢీ కొన్నప్పటికీ.. వాహనాలు స్వల్పంగానే దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications