బాలినేనికి జగన్ తాజా ఆఫర్ - "మెగా" ట్విస్ట్, వాట్ నెక్స్ట్..!!

వైసీపీలో బాలినేని వ్యవహారం సంచలనంగా మారింది. బాలినేని పార్టీ వీడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే జగన్ తో బాలినేని సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితుల పైన చర్చించారు. ఈవీఎంల వ్యవహారం పైన తాను చేస్తున్న పోరాట గురించి బాలినేని ప్రస్తావించారు. పార్టీ నుంచి మద్దతు లేకపోవటం పైన ప్రశ్నించారు. ఈ భేటీలో బాలినేనికి జగన్ తాజాగా ఒక ఆఫర్ ఇచ్చారు. బాలినేని తన వైఖరి ఏంటో క్లారిటీ ఇచ్చేసారు.

జగన్ తో బాలినేని భేటీ
ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం మొదలైంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తప్పించి సురేష్ ను కొనసాగించాలని నిర్ణయించిన సమయం నుంచే బాలినేని పార్టీ తీరు పట్ల అసహనంతో ఉన్నారు. ఆ తరువాత జగన్ ప్రతీ సందర్భంలో బుజ్జగించటంతో బాలినేని తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతూ వస్తున్నారు. తాజాగా ఎన్నికల ఫలితాల్లో అనుమానాల పై బాలినేని ఈవీఎలం పై న్యాయ పోరాటం చేస్తున్నారు.

Balineni Rejects YS Jagan latest offer likely to quit YSRCP

బాధ్యతల పై జగన్ ఆఫర్
ఈ అంశంలో తనకు పార్టీ నుంచి మద్దతు రావటం లేదని బాలినేని ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. కొద్ది రోజులుగా బాలినేని పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. జనసేనలోకి వెళ్ల బోతున్నారని జిల్లాలో టాక్. అయితే, పలు సందర్బాల్లో తాను పార్టీ వీడటం లేదని బాలినేని స్పష్టత ఇచ్చారు. అయితే, బాలినేని సొంత పార్టీ నేతల పైనే పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే సమయంలో జిల్లా అధ్యక్ష్ పదవి విషయంలోనూ చెవిరెడ్డి పేరు తెర పైకి రాగా..జిల్లాకు చెందిన వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని బాలినేని డిమాండ్ చేసారు.

జనసేనతో టచ్ లో బాలినేని
దీంతో, మాజీ సీఎం జగన్ తో బాలినేని సమావేశమయ్యారు.జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి పార్టీని బలోపేతం చేయాలని బాలినేనిని జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలినేని.. తనకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే ఉద్దేశ్యం లేదని ఖరాఖండీగా చెప్పేసినట్టు సమాచారం. అయితే బాలినేని.. జనసేన, బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం మళ్లీ తెర మీదకు వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబుతో బాలినేని టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు బాలినేని వైసీపీ వీడటం..జనసేనలో చేరటం పైన ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+