రిసార్టులో అమ్మాయిలతో చిందులు: మంత్రి బాలినేని కీలక అనుచరుడి బర్త్ డే పార్టీ(వీడియో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివా'స్ రెడ్డి అనుచరుడి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అమ్మాయిలతో చిందులు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై పలువురు టీడీపీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

రిసార్టులో బర్త్ డే పార్టీ..
మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు నల్లమలపు కృష్ణారెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి తన పుట్టినరోజు సందర్బంగా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పార్టీ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన కొత్తపట్నంలో ఉన్న నల్లూరి గార్డెన్ రిసార్ట్‌లో వీరంతా పార్టీ చేసుకున్నారు.

అమ్మాయిలతో చిందులు..
కాగా, బర్త్ డే పార్టీ సందర్భంగా రిసార్టుకు కొంతమంది అమ్మాయిలను కూడా తీసుకొచ్చారు. వారితో చిందులు వేసుకుంటూ పార్టీ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పార్టీలకు అనుమతి ఎలా ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు.

వీడియోలు షేర్ చేస్తూ టీడీపీ విమర్శలు..
మంత్రి అనుచరుడు కావడంతో వదిలేస్తారా? అంటూ స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులు ఈ వీడియోలను షోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
రేవ్ పార్టీ వైరల్ అంటూ.,
‘మంత్రి బాలినేని అనుచరుడు నల్లమలుపు కృష్ణ రెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి హల్చల్.. తన బర్త్డే కు రేవ్ పార్టీ పెట్టిన కృష్ణారెడ్డి. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం నల్లూరి గార్డెన్ రిసార్ట్లో రేవ్ పార్టీ. వైరల్ అవుతున్న వీడియోలు' అంటూ మద్దిన ఈశ్వరయ్య అనే టీడీపీ అభిమాని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications