తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొల‌గించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!!

హైద‌రాబాద్ : తెలుగుదేశం ఇంత‌కుముందు ప్రాంతీయ పార్టీ. ఇపుడు అది జాతీయ పార్టీ కాబ‌ట్టి రెండు జాతీయ పార్టీల‌కు ఒకే గుర్తు ఉండ‌రాదు. అందువ‌ల్ల స‌మాజ్ వాదీ పార్టీ త‌ర్వాత స్థాపించ‌బ‌డ్డ తెలుగుదేశం పార్టీ గుర్తు తొల‌గించాల‌ని కొంద‌రు లాయ‌ర్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఇపుడు తెలుగుదేశం పోటీచేస్తున్నందున‌ తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీలకు ఒకేగుర్తును ఎలా కేటాయిస్తారని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం (ఏఏఏ) అధ్యక్షురాలు కేఎంజేడీ శ్యామసుందరి ఎన్నిక‌ల సంఘాన్ని ప్రశ్నించారు. ఫిర్యాదు అనంత‌రం ఈ విష‌య‌మై ఆమె మీడియాతో మాట్లాడారు. రెండు జాతీయ పార్టీల‌కు ఒకే ఎన్నిక‌ల గుర్తు ఎలా సాధ్యం అని ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ను ప్ర‌శ్నిస్తున్నారు.

Ban the cycle symbol to tdp..! complained to EC..!!

త్వరలో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల వివరణ కోరాలని ఈసీఐకి ఆమె విజ్ఞప్తి చేశార‌ట‌. అనంత‌రం వెంట‌నే తెలుగుదేశం పార్టీకి సైకిల్‌గుర్తును తొలిగించాలని డిమాండ్ చేశారు. ఐతే దేశంలో ఏదైనా ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే స‌మ‌స్య‌పై ఆమె పోరాడితే క‌నీసం ఈ దేశానికి ఒక స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భించేద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. కానీ అలాంటిదేమీ లేకుండా ఆ ఇరు పార్టీల్లో ఎవ‌రు ఒక‌రు చేయాల్సిన కంప్ల‌యింట్ శ్యామసుందరి ఎన్నిక‌ల ముందు చేయ‌డం వెనుక ఎవ‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌నే అంశం పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+